HYD: సనత్ నగర్‌లో నిర్మించిన టిమ్స్ ఆసుపత్రిని సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఆస్పత్రిలో ముందుగా ఓపీ సేవలు ప్రారంభం కానుండగా, నెల రోజుల తర్వాత సర్జరీలు మొదలవుతాయి. రూ.1,126 కోట్లతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 300 ఐసీయూ బెడ్స్‌తో సహా మొత్తం 1,082 బెడ్స్ ఉన్నాయి. దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను ఈ ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు.
తెలంగాణ
నేడు TIMSను ప్రారంభించనున్న సీఎం


