హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జిల్లాకు వర్ష సూచన

NZB: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో 72 గంటలపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గత 15 రోజులుగా భారీ వర్షాలు లేకపోగా, కామారెడ్డి జిల్లాలో గతంలో మోస్తరు వర్షం నమోదైంది. జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది. రైతులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు.