హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జిల్లాలో మండల స్థాయి ‘ప్రజావాణి’

GDWL: సోమవారం నుంచి మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు ప్రజలు తమ సమస్యలపై అధికారులకు నేరుగా అర్జీలు సమర్పించవచ్చు. ఎంపీడీవోల పర్యవేక్షణలో అన్ని శాఖల అధికారులు పాల్గొని, వీటికి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపుతారు.