KDP: మైలవరం మండలం తొర్రివేముల గ్రామంలో ‘గుడ్ ఈవెనింగ్ విలేజ్’ కార్యక్రమంలో భాగంగా ఎస్సై శ్యామ్‌సుందర్‌రెడ్డి సిబ్బందితో కలిసి ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఎస్సీ కాలనీలో పర్యటించి స్థానికులతో సమావేశమై బాల్యవివాహాలు, బాలికల విద్య, ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. యువత నేరాలకు దూరంగా ఉండి చదువు, కెరీర్‌పై దృష్టి సారించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
యువత చదువు,కెరీర్‌పై దృష్టి పెట్టండి: ఎస్సై


