హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెరువులో పడి పశువుల కాపరి మృతి

BHPL: మల్హర్ మండలం మల్లారం పంచాయతీ పరిధిలోని దబ్బగట్టులో ప్రమాదవశాత్తు చెరువులో పడి రాయమల్లు (55) మృతి చెందాడు. ఆదివారం గేదెలను మేతకు తీసుకెళ్లిన ఆయన, సాయంత్రం చెరువులోకి వెళ్లిన గేదెలను తీసుకొస్తుండగా నీటిలో మునిగిపోయాడు. గజ ఈతగాళ్లతో గాలించగా కొద్దిసేపటి తర్వాత మృతదేహం లభ్యమైంది. పూడిక మట్టి కోసం గతంలో తవ్విన గుంతలో పడి ప్రమాదం జరిగింది.