హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైకుంఠధామంలో వసతుల కొరత

JGL: కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామశివారులో నిర్మించిన వైకుంఠధామంలో వసతుల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆవరణలో బోరుబావి ఉన్నప్పటికీ వైర్లు, స్టార్టర్ బాక్సులు లేకపోవడంతో పనిచేయడం లేదు. అంత్యక్రియల అనంతరం బట్టలు మార్చుకునే గదుల పైకప్పు రేకులు విరిగిపోయాయి. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టి అవసరమైన వసతులు కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.