హైదరాబాద్: 28°C
తెలంగాణ

కారు అదుపుతప్పి లోయలోకి.. ఐదుగురికి గాయాలు

MLG: తాడ్వాయి మండలం మేడారంలో భక్తుల కారు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. ఆదివారం భద్రాచలం సమీపంలోని మొండికుంటకు చెందిన రవితేజ కుటుంబంతో సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని తిరిగి వెళ్తుండగా రావిచెరువు మూలమలుపు వద్ద కారు అదుపుతప్పి పల్టీలు కొడుతూ లోయలోకి దూసుకెళ్లింది. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి, పోలీసులు విచారణ చేపట్టారు.