హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేంపల్లిలో జిల్లా స్థాయి యోగా పోటీలు

KDP: వైఎస్సార్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 19న ఉదయం 8.30 గంటలకు జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహించనున్నట్లు రాయలసీమ యోగా స్పోర్ట్స్ ఇన్‌ఛార్జ్ మనోహరరెడ్డి తెలిపారు. జిల్లా యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీల్లో పాల్గొనేవారు రూ.100 ప్రవేశ రుసుముతో పాటు ఆధార్ జిరాక్స్, పాస్‌పోర్టు సైజు ఫొటోలు తీసుకురావాలని సూచించారు.