హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

JGL: జగిత్యాల పట్టణం 28వ వార్డుకు చెందిన ఆరుముళ్ల ఉమేందర్ తల్లి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆదివారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.