హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ఈ గ్రామాల్లో విద్యుత్ నిలిపివేత.

MDK​: కౌడిపల్లి, వెంకట్రావుపేట 33 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలోని గేటు తండా వద్ద లైన్ల మరమ్మతుల కారణంగా సోమవారం ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పవర్ కట్ ఉంటుందని ఏఈ సాయికుమార్ తెలిపారు. దీంతో రాజిపేట, మహమ్మద్‌నగర్, కంచన్‌పల్లి, వెంకట్రావుపేట సబ్‌స్టేషన్ల పరిధిలో సరఫరా ఉండదని, వినియోగదారులు అంతరాయాన్ని గమనించాలని కోరారు.