MDK: తూప్రాన్, ఎన్‌హెచ్-44 పరిధిలోని మనీష్ దాబా, న్యూ రెడ్డి దాబాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్కడ అక్రమంగా మద్యం సేవించేందుకు అనుమతులు ఇవ్వడంతో యాజమాన్యాలపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై గంగరాజు తెలిపారు. దాబాల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
తెలంగాణ
దాబా యాజమాన్యాలపై పోలీసుల కేసు


