హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జగ్గంపేటలో రూ.1.50 కోట్లతో సరికొత్త వారాహి మాత ఆలయం

KKD: జగ్గంపేటలోని బాలాజీ నగర్ కాలనీలో శ్రీ వారాహి మాత ఆలయ నిర్మాణానికి ఆదివారం ట్రస్ట్ సభ్యుల సమక్షంలో భూమిపూజ చేశారు. స్థానిక MLA, TTD బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ చొరవతో TTD నుంచి రూ.40 లక్షల నిధులు మంజూరయ్యాయి. సుమారు రూ.1.50 కోట్ల అంచనా వ్యయంతో ఆలయ నిర్మాణం చేపట్టాలని కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది.