హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా సభ్యుడిగా పండరి

SRD: బీజేపీ ఓబీసీ మోర్చా సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుడిగా కంగికి చెందిన గంపల్లి పండరి నియమితులయ్యారు. ఈ నియామకాన్ని జిల్లా అధ్యక్షుడు కోసం విఠల్ ప్రకటించారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నాయకులకు ధన్యవాదాలు తెలిపిన పండరి, ఓబీసీ వర్గాల సంక్షేమం, పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు.