హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దేశాభివృద్ధిలో యువత కీలకం'

సిరిసిల్ల: ఇల్లంతకుంట మండల కేంద్రంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఆదివారం యువ సమ్మేళనం నిర్వహించారు. సమితి అధ్యక్షుడు రేగుల కార్తీక్ మాట్లాడుతూ.. యువత క్రమశిక్షణ, దేశభక్తితో ముందుకు సాగాలని సూచించారు. సమాజానికి సేవ చేయడంతో పాటు అన్ని రంగాల్లో రాణించి దేశ ప్రగతికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల యువకులు హాజరయ్యారు.