KNR: హుజూరాబాద్ అంబేడ్కర్ చౌరస్తా వద్ద ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఆదివారం టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు నగునూరి శేఖర్ దీక్షకు సంఘీభావం తెలిపారు. రెండు దశాబ్దాల పోరాటంతో సాధించుకున్న ఇళ్ల స్థలాలను కాపాడుకునేందుకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు.
తెలంగాణ
ఇళ్ల స్థలాల పరిరక్షణకు జర్నలిస్టుల దీక్ష


