MBNR: మహమ్మదాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఇవాళ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో నరేందర్‌రెడ్డి తెలిపారు. మండల ప్రజలు తమ అర్జీలు, ఫిర్యాదులు, సమస్యలను నేరుగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం పొందాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
మహమ్మదాబాద్‌లో నేడు ప్రజావాణి


