GDWL: కేటీదొడ్డి మండలం చింతలకుంట గ్రామానికి చెందిన హరిజన హనుమంతు (28) ఆదివారం సాయంత్రం సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. కుటుంబానికి పెద్దదిక్కైన హనుమంతు మృతితో భార్య, ముగ్గురు పిల్లలు విషాదంలో మునిగిపోయారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
తెలంగాణ
విద్యుదాఘాతంతో యువకుడు మృతి


