హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

పుదీనా టీ తాగితే కలిగే ప్రయోజనాలు!

పుదీనా టీ తాగడం వల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం తగ్గి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పుదీనాలోని సువాసన మెదడుకు ప్రశాంతతనిచ్చి, అలసటను తగ్గిస్తుంది. జలుబు, దగ్గు ఉన్నప్పుడు ముక్కు దిబ్బడను తగ్గించి ఊపిరి పీల్చుకోవడం సులభం చేస్తుంది. నోటిలోని బ్యాక్టీరియాను అరికట్టి శ్వాస తాజాగా ఉండేలా చేస్తుంది. ఇది కేలరీలు లేని పానీయం కాబట్టి బరువు తగ్గాలనుకునేవారికి మంచి ఎంపిక.