హైదరాబాద్: 28°C
వ్యాపారం

బంగారు ఆభరణాలకు 'సోల్డ్' ట్యాగ్‌

దేశీయ బంగారు ఆభరణాల విపణిలో పారదర్శకతను పెంచేందుకు కేంద్రం విప్లవాత్మక డిజిటల్ ట్రాకింగ్ విధానానికి శ్రీకారం చుడుతోంది. ప్రస్తుతం అమలులో ఉన్న 6 అంకెల ఆల్ఫాన్యూమరిక్ HUID (హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్) వ్యవస్థకు ప్రభుత్వం మరింత పదను పెడుతోంది. ప్రతిపాదిత విధానం ప్రకారం, ఒక ఆభరణం అమ్ముడవగానే దాని HUID కోడ్‌కు 'అమ్మబడింది' (సోల్డ్) అనే హోదాను కేటాయిస్తారు.