హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుక్కల దాడి..చిన్నారికి తీవ్ర గాయలు

WGL: వరంగల్ జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 19వ డివిజన్ భగత్ సింగ్ నగర్ దారుణం చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం వీధి కుక్కలు దాడి చేయడంతో వంగరి సాయి వర్ధన్ (8) తీవ్రంగా గాయపడ్డాడు. ఇంటి ముందు ఆడుకుంటుండగా కుక్కలు ఒక్కసారిగా దాడి చేసినట్లు తల్లిదండ్రులు తెలిపారు.దాడిలో చేతులు, నుదుటిపై గాయాలయ్యాయని,ఎంజీఎం ఆసుపత్రికి తరలించి ఇంజక్షన్ వేయించినట్లు పేర్కొన్నారు