హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీసీఐ పునరుద్ధరణకై వినూత్న నిరసన

ADB: సీసీఐ పునరుద్ధరణ డిమాండ్‌తో సాధన కమిటీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు 8వ రోజుకు చేరాయి. ఇవాళ తంతోలి గ్రామస్థులు కళ్లకు నల్లగంతలు, చెవిలో పువ్వులతో వినూత్న నిరసన తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యేలను గెలిపిస్తే పరిశ్రమ తెరిపిస్తామన్న హామీని బీజేపీ విస్మరించిందని కో-కన్వీనర్ నారాయణ విమర్శించారు. ఈ దీక్షలకు ఏఐటీయూసీ విలాస్, ఏఐవైఎఫ్ ధర్మేంద్ర తమ మద్దతు ప్రకటించారు.