హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈతకు వెళ్లి వ్యక్తి మృతి

PDPL: సుల్తానాబాద్‌కు చెందిన జహంగీర్ కుటుంబంతో కలిసి నీరుకుల్ల మానేరు వాగు వద్దగల రంగనాయక ఆలయానికి పిక్నిక్ వెళ్లాడు. వాగులో ఈతకు దిగి నీటిలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న స్థానిక సర్పంచ్ కాంపల్లి సతీష్ గజఈతగాళ్లతో గాలింపు జరిపించి మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు