MDK: తూప్రాన్ పట్టణ పరిధిలోని బ్రాహ్మణపల్లి–వెంకటాపూర్ (పిటి) నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న ఘటనపై ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గంగరాజు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తూప్రాన్ వైపు తరలిస్తుండగా టిప్పర్‌ను సీజ్ చేశారు. వాహన యజమాని ఇత్తారి కృష్ణ, డ్రైవర్ అబ్దుల్ అజార్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.
తెలంగాణ
అక్రమ మట్టి రవాణా కేసు నమోదు


