MLG : ములుగు నూతన కలెక్టరేట్ ఐడీఓసీ భవనం ప్రారంభోత్సవంలో ఆదివారం ఆసక్తికర దృశ్యం కనిపించింది. భవనం ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా కలెక్టర్‌ను ఆయన కుర్చీలో కూర్చోబెట్టి పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. ప్రజాసేవలో మరింత అంకితభావంతో పనిచేయాలని ప్రోత్సహించిన సీఎం తీరు ఆకట్టుకుంది. కార్యక్రమంలో మంత్రి సీతక్క ఉన్నారు.
తెలంగాణ
కలెక్టర్ కుర్చీలో కలెక్టర్.. పక్కనే సీఎం


