హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఫోన్ పోతే ఫిర్యాదు చేయండి'

MNCL: ఫోన్ పోతే వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని లక్షెట్టిపేట ఎస్సై గోపతి సురేష్ సూచించారు. పాతకొమ్ముగూడెంకు చెందిన సురం సునీత మొబైల్ ఫోన్ పోయిందని ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఎస్సై ఆదేశాల మేరకు కానిస్టేబుల్ సంజీవ్ కుమార్ CEIR పోర్టల్ ద్వారా మొబైల్‌ను ట్రేస్ చేసి స్వాధీనం చేసుకున్నారు. శనివారం పోలీస్ స్టేషన్‌లో బాధితురాలికి ఫోన్‌ను అందజేశారు.