BDK: భద్రాచలం గోదావరి కరకట్ట వద్ద ఆదివారం శ్రావణమాసాన్ని పురస్కరించుకుని గోదావరి మాతకు నదీ హారతులు వైభవంగా నిర్వహించారు. భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం అధ్యక్షుడు రామవజ్జల రవికుమార్ ఆధ్వర్యంలో భక్తులతో గణపతి పూజ, దీపోత్సవం చేయించారు. ఈ పవిత్ర క్రతువు వల్ల ప్రజలకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: వైభవంగా గోదావరి నదీ హారతి


