హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమ్మవారి జాతరలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

SRPT: అనంతగిరి మండల పరిధిలోని చనుపల్లి, అమీనాబాద్ గ్రామాల్లో నిర్వహించిన ముత్యాలమ్మ జాతర మహోత్సవాల్లో ఈరోజు కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని ముత్యాలమ్మ అమ్మవారి దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.