హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు ఖానాపూర్‌లో మండల ప్రజావాణి

WGL: ఖానాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు MPDO వి.అద్వైత తెలిపారు. మండల స్థాయిలో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి 23 శాఖలకు చెందిన అధికారులు పాల్గొంటారని చెప్పారు. ప్రజలు తమ సమస్యలను జిల్లా స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే పరిష్కరించుకోవచ్చన్నారు. ప్రజలు సద్వినియోగపరచుకోవాలని కోరారు.