హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు రేబిస్‌పై అవగాహన

ASR: అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులకు స్థానిక వెటర్నరీ ఆసుపత్రిలో రేబిస్ వ్యాక్సిన్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కమిషనరేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు ప్రిన్సిపాల్ డా. ఆర్. కుసుమకుమారి ఆధ్వర్యంలో జువాలజీ విభాగం, రెడ్ రిబ్బన్ కమిటీ కార్యక్రమాన్ని నిర్వహించింది. రేబిస్ లక్షణాలు, జంతువుల కాటు, తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు.