హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విశాఖ ఎయిర్‌పోర్టు కొనసాగించాలి'

విశాఖ ఎయిర్‌పోర్టును మూసివేసి భోగాపురం ఎయిర్‌పోర్టుకు తరలించడాన్ని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ వ్యతిరేకించారు. ఎయిర్‌పోర్టుపై ఆధారపడిన వేలాది కార్మికుల ఉపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు న్యాయం చేయకపోతే ఒక్కొక్కరికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరచారు.