SRPT: పాలకవీడు మండలం మహంకాళీగూడెం కృష్ణానది ఒడ్డున ఈరోజు గుర్తుతెలియని వివాహిత మృతదేహం లభ్యమైంది. మృతురాలి వయసు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి ఆచూకీ తెలిసిన వారు సీఐ చరమందరాజు లేదా ఎస్ఐ కోటేష్‌ను సంప్రదించాలని కోరారు.
తెలంగాణ
గుర్తు తెలియని వివాహిత మృతదేహం లభ్యం


