హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీ వెంకటేశ్వర స్తుతి పుస్తకావిష్కరణ

NGKL: కల్వకుర్తి పట్టణంలోని శ్రీవేంకటేశ్వర దేవాలయంలో కర్నాటి రఘురాములు గౌడ్ రచించిన ‘శ్రీ వెంకటేశ్వరస్తుతి’ పుస్తకాన్ని ఆదివారం ఆలయ ట్రస్ట్ ఫౌండర్ కల్వ మనోహర్ ఆధ్వర్యంలో కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి చేతుల మీదుగా ఆవిష్కరించారు. పుస్తకంలో ఆధ్యాత్మిక, భక్తిభావంతో కూడిన అంశాలు ఉన్నాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.