హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉరుకుంద ఉత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే సమీక్ష

KRNL: కౌతాళం మండలం ఉరుకుంద శ్రీ ఈరన్న స్వామి ఆలయంలో శ్రావణ ఉత్సవాల ఏర్పాట్లను ఆదివారం ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వాల్మీకి పరిశీలించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. క్యూ లైన్లు, తాగునీరు, ప్రసాదం, పారిశుద్ధ్యం, పార్కింగ్, భద్రతపై అధికారులతో సమీక్షించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.