హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో పలు మండలాల్లో తేలికపాటి వర్షం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షపాతం నమోదైంది. దమ్మపేట మండలం మల్కారం వద్ద అత్యధికంగా 3.5 మి.మీ వర్షం కురిసింది. బూర్గంపహాడ్‌లో 2.3, అశ్వారావుపేటలో 1.5, మణుగూరులో 1.3, పాల్వంచ సీతారాంపట్నంలో 1.0 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 37.2°Cగా నమోదైంది.