TG: హైదరాబాద్‌లోని ఉప్పల్ పీఎస్ పరిధిలో వైద్యవిద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రామంతాపూర్‌లో నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి దూకి కొల్కూరి భరద్వాజ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భరద్వాజ్ ఉస్మానియా వైద్య కళాశాలలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
క్రైమ్
విషాదం.. వైద్యవిద్యార్థి ఆత్మహత్య


