హైదరాబాద్: 28°C
క్రైమ్

గేమ్స్ ఆడొద్దన్నాడని మామను చంపిన అల్లుడు

AP: చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గేమ్స్ ఆడొద్దని మందలించిన మామ సుబ్రహ్మణ్యంపై అల్లుడు అశోక్ దాడి చేశాడు. దీంతో సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే మృతిచెందాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు. పూతలపట్టు మండలం తేనేపల్లిలో ఈ ఘటన జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.