హైదరాబాద్: 28°C
క్రైమ్

ప్రియురాలిని గొడ్డలితో నరికి చంపిన ప్రియుడు

AP: పల్నాడు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలు లక్ష్మిని ప్రియుడు గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటన బొల్లాపల్లి మండలం గరికపాడులో జరిగింది. అనుమానంతోనే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి స్వస్థలం శ్రీకాకుళంగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.