హైదరాబాద్: 28°C
క్రైమ్

హత్య కేసులో ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు అరెస్టు

AP: కాకినాడలో జరిగిన ఓ హత్య కేసులో ఇద్దరు ట్రాన్స్‌జెండర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 3న రాజుశివ అనే వ్యక్తిపై ట్రాన్స్‌జెండర్లు దాడి చేయగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు. కిరణ్మయి, అజయ్ అనే ఇద్దరు ట్రాన్స్‌జెండర్లను ఈ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. డబ్బుల పంపిణీలో తలెత్తిన వివాదమే ఈ హత్యకు దారితీసిందని వెల్లడించారు.