హైదరాబాద్: 28°C
క్రైమ్

ఏపీలో ఒడిశా మహిళ మృతదేహం కలకలం

AP: విజయనగరం జిల్లా మరుపల్లి సమీపంలో ఉన్న మామిడితోటలో ఒడిశాకు చెందిన మహిళ మృతదేహాన్ని పాతిపెట్టిన ఘటన కలకలం రేపింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడు మోహన్‌ కిల్లోను ఒడిశా పోలీసులు ఘటనా స్థలానికి తీసుకొచ్చి, భూమిలో పాతిపెట్టిన మృతదేహాన్ని బయటకు తవ్వించారు. మృతురాలు అనిత (22), నిందితుడు మోహన్ (45) ఇద్దరూ ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.