AP: పశ్చిమగోదావరి జిల్లాలో కారు కాల్వలోకి దూసుకెళ్లి ముగ్గురు చనిపోవడంపై మంత్రులు పార్థసారధి, గొట్టిపాటి స్పందించారు. ముగ్గురు మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనపై ప.గో. జిల్లా ఎస్పీతో మాట్లాడారు. ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్పీ మంత్రులకు వివరించారు. గల్లంతైన మరో ఇద్దరి కోసం గాలింపు వేగవంతం చేయాలని మంత్రులు ఆదేశించారు.
క్రైమ్
ముగ్గురి మృతిపై మంత్రులు దిగ్భ్రాంతి


