ASF: ఆసిఫాబాద్ రోడ్డు - సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ల మధ్య, గొల్లగూడ బ్రిడ్జి సమీపంలో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం ఆదివారం లభ్యమైనట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ సురేష్ గౌడ్ తెలిపారు. మృతుడి వయసు అందాజా 50-56 సంవత్సరాలు ఉంటుందన్నారు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. మృతదేహం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురిలో భద్రపరిచినట్లు తెలిపారు.
తెలంగాణ
గుర్తు తెలియని మృతదేహం లభ్యం


