హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నేటి నుంచి మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహణ'

SRPT: సూర్యాపేటలో ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఈరోజు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. ఈ నెల 17 నుంచి స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. వివిధ శాఖల అధికారులు విధిగా హాజరవుతారని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.