హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలోకి 320 కుటుంబాలు చేరిక

ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని నల్లబండ బజార్ 17వ వార్డులో వైసీపీకి చెందిన మాజీ పట్టణ అధ్యక్షుడు షేక్ హరుణ్ భాషా వారి అనుచరులు సుమారు 320 కుటుంబాలు ఆదివారం టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. నూతనంగా చేరిన వారికి పార్టీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.