హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మోటారు వైరు చోరీ.. నిలిచిన నీటి సరఫరా

TPT: నాయుడుపేట మండలం పెరుకులపాటి కండ్రిగలో పంచాయతీ మంచినీటి బావి మోటారు కాపర్ వైరు చోరీకి గురైంది. గుర్తుతెలియని వ్యక్తులు సుమారు 70 అడుగుల వైరు అపహరించడంతో మోటారు పనిచేయడం లేదు. దీంతో గ్రామంలో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.