హైదరాబాద్: 28°C
తెలంగాణ

బైక్ ప్రమాదంలో యువకుడు మృతి

GDWL: ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో మల్దకల్ మండలం పెద్దొడ్డి గ్రామానికి చెందిన బొప్పల స్వామి (30) మృతి చెందాడు. శనివారం రాత్రి మొబైల్ షాప్ మూసివేసి బైక్‌పై ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన స్వామిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.