హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయానికి పోటెత్తిన భక్తులు

SDPT: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వేకువజామున కోనేరులో స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా బోనాలు, పట్నాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కొండపై ఉన్న రేణుక ఎల్లమ్మను దర్శించుకున్నారు. శ్రావణమాసం సందర్భంగా భక్తుల రద్దీ పెరిగిందని ఈవో కట్ట సుధాకర్‌రెడ్డి తెలిపారు.