హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐటీఐలో ఖాళీ సీట్లు.. 24 నుంచి ప్రత్యక్ష ప్రవేశాలు

BHPL: కాటారం మండల కేంద్రంలోని ఐటీఐ, ఏటీసీ సెంటర్‌లో ఈనెల 24 నుంచి వాక్‌ఇన్ ఇంటర్వ్యూల ద్వారా అడ్మిషన్లు ప్రారంభమవుతాయని ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. 241 సీట్లకు గాను ఇప్పటివరకు 40 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయని పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఏటీసీ కోర్సుల్లో చేరి స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.