హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలిలో రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

GNTR: తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని యడ్లలింగయ్య గేట్ వద్ద రైలు నుంచి జారిపడి సుమారు 35 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. చెన్నై మార్గంలో వెళ్తున్న రైలు నుంచి జారిపడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెనాలి GRP ఎస్ఐ సరస్వతి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాలని కోరారు.