ములుగు జిల్లాలో ఆగస్టు17 నుంచి ప్రతిసోమవారం అన్ని మండలాల ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ హేమంత్ సహదేవరావు ఆదివారం తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తులను మండల స్థాయిలో అందించాలని సూచించారు. అన్నిశాఖల మండలస్థాయి అధికారులు సకాలంలో హాజరుకావాలని ఆదేశించారు. దరఖాస్తులను పరిశీలించి ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.
తెలంగాణ
మండలాల్లో ప్రతి సోమవారం ప్రజావాణి : కలెక్టర్


