హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బురదకుంటగా మారిన మారెళ్ల ప్రధాన రహదారి

KRNL: తుగ్గలి మండలం మారెళ్లలో ప్రధాన రహదారి బురదకుంటగా మారిపోయింది. సరైన సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలవలు లేకపోవడంతో రహదారి పైనే మురుగు నీరు, బురద చేరుతుందని గ్రామ ప్రజలు తెలిపారు. వీటి ద్వారా వృద్ధులు, చిన్నపిల్లలు అనారోగ్యాలకు గురవుతున్నారన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలవలు ఏర్పాటు చేయాలని పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదన్నారు.